: కాంగ్రెస్ నేతకు బీజేపీ ఎస్ఎంఎస్... కుతకుతలాడిపోయిన నేతలు
కాంగ్రెస్ పార్టీకి వారంతా వీరవిధేయులు. పార్టీ జెండాను మోస్తూ, పార్టీ కోసం పనిచేస్తున్నవారు. అలాంటి వారికి తమ పార్టీలో సభ్యత్వం తీసుకొమ్మంటూ బీజేపీ ఎస్ఎంఎస్ పంపింది. దీంతో, వారందరికీ చిర్రెత్తుకొచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ పట్టణానికి చెందిన మహేష్ దీక్షిత్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు. ఆయనతో పాటు మరో 12 మంది కాంగ్రెస్ నేతలకు సభ్యత్వ నమోదు చేసుకోవాలంటూ బీజేపీ ఎస్ఎంఎస్ పంపింది. దీంతో, బీజేపీ సంఖ్యాబలం కోసమే ఇలాంటి తప్పుడు పద్ధతులు అవలంబిస్తోందని ఆరోపిస్తూ, ఇలా ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. దీనిని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని వారు ప్రకటన జారీ చేశారు.