: 'మేకిన్ ఇండియా'లో భాగంగా ఓడలు నిర్మిద్దాం: మోదీ
'మేకిన్ ఇండియా'లో భాగంగా మనమే ఓడలు నిర్మిద్దామని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జాతీయ సముద్ర రవాణా దినోత్సవం సందర్భంగా నౌకాయానశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భారత్ కు సొంతంగా ఓడలు నిర్మించే సత్తా ఉందని, దానిని ప్రపంచానికి నిరూపిద్దామని అన్నారు. జల రవాణాలో మన దేశానికి 5000 ఏళ్ల చరిత్ర ఉందని ఆయన చెప్పారు. దీనికి సంబంధించి ఓ వస్తు ప్రదర్శన శాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన విశేషాలన్నీ భవిష్యత్ తరాలకు తెలిసేలా అందులో పొందుపరుస్తామని మోదీ పేర్కొన్నారు.