: అమెరికన్ టీవీ షోలో పైలట్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రియాంక... ముంబయికి తిరుగుప్రయాణం
తాను నటిస్తున్న అమెరికన్ టీవీ షో 'క్వాంటికో' పైలట్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా వెల్లడించింది. ప్రస్తుతం తాను ముంబయి వెళుతున్నానని తెలిపింది. ఈ విషయాన్ని పీసీ ట్విట్టర్ ద్వారా చెప్పింది. "'క్వాంటికో' పైలట్ ఎపిసోడ్ పూర్తయింది. త్వరలోనే కలుస్తాను. ఈ షోలో యువ అలెక్స్ పారిష్ పాత్ర చేయడం చాలా ఆనందంగా ఉంది. షో టీమ్ కు కృతజ్ఞతలు" అని ట్వీట్ చేసింది. అంతే కాదు, "బై బై న్యూయార్క్... ముంబయి కాలింగ్... యే! ఇంటికి వెళ్లేందుకు ఇక ఆలస్యం చేయను" అంటూ పీసీ పోస్టు చేసింది. ఏబీసీకి చెందిన ఈ షో కోసం ప్రియాంక దాదాపు నెలరోజులకు పైగా న్యూయార్క్ లో ఉంది.