: నటుడు నసీరుద్దీన్ షాపై శివసేన మండిపాటు


బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షాపై శివసేన మండిపడింది. ఇటీవలే పాకిస్థాన్ నుంచి భారత్ తిరిగొచ్చిన షా పాక్ అనుకూల వ్యాఖ్యలు చేయడాన్ని శివసేన తప్పుబట్టింది. పార్టీ పత్రిక సామ్నాలో దీనిపై విమర్శించింది. షా పాక్ కు మద్దతుగా మాట్లాడతాడని ఊహించలేదని పేర్కొంది. సరిహద్దు ఆవల నుంచి వచ్చిన ఉగ్రవాదులు భారత్ పై చేసిన దాడులను ఇక మర్చిపోవాల్సిందేనా? అని ప్రశ్నించింది. కాగా, పాక్ లో పర్యటించిన సమయంలో నసీరుద్దీన షా మాట్లాడుతూ... రెండు దేశాల మధ్య వైరం కారణంగా తాను నిరుత్సాహానికి గురైనట్టు తెలిపారు. పాకిస్తానీలను భారతీయులు ఎందుకు ఆప్యాయంగా ఆలింగనం చేసుకోరని ఆలోచిస్తే తనకు ఆశ్చర్యం కలుగుతుందని అన్నారు. భారత్ గురించి పాక్ జాతీయుల్లో ఎంతో ఆసక్తి నెలకొని ఉందని తెలిపారు. భారతీయులు, భారత కళాకారులను వారెంతగానో ఆదరిస్తారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News