: అమరవీరుల కుటుంబాలకు రూ. 13.20 కోట్లు పంపిణీ చేసిన ఈటెల


అమరవీరుల కుటుంబాలకు ఎంత చేసినా రుణం తీరదని... తెలంగాణ రియల్ హీరోస్ అమరవీరులేనని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఈ రోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో 132 అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల వంతున రూ. 13.20 కోట్లను ఈటెల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తున్నారన్నారు. బంగారు తెలంగాణను సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

  • Loading...

More Telugu News