: పాక్ తో జరిగిన మ్యాచ్ లో చేసిన 64 పరుగులు ఎంతో అమూల్యమైనవి: వాట్సన్


2015 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ జట్టుపై చేసిన 64 పరుగులే తనకు ఎంతో అమూల్యమైనవని ఆస్ట్రేలియా ఆటగాడు షేన్ వాట్సన్ తెలిపాడు. ప్రపంచకప్ లో విజయం సాధించిన ఆనందంలో వాట్సన్ మాట్లాడుతూ, వరల్డ్ కప్ లో తన ప్రదర్శనపై తృప్తిగా ఉన్నానని అన్నాడు. పాక్ పై చేసిన 64 పరుగులు జట్టు విజయానికి దోహదం చేశాయని వాట్సన్ చెప్పాడు. వరుసగా రెండుసార్లు వరల్డ్ కప్ సాధించిన జట్టులో సభ్యుడిగా ఉండడం గొప్ప అనుభూతి అని వాట్సన్ పేర్కొన్నాడు. తమ జట్టు వరల్డ్ కప్ ను సాధించడం గర్వంగా ఉందని వాట్సన్ తెలిపాడు.

  • Loading...

More Telugu News