: సానియా కన్నా సైనా ఏం తక్కువ?: వీహెచ్
బ్యాడ్మింటన్ వరల్డ్ నెంబర్ వన్ గా అవతరించిన హైదరాబాదీ షట్లర్ సైనా నెహ్వాల్ ను రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అభినందించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ లో టాప్ ర్యాంకు సాధించిన మొదటి భారతీయురాలు సైనా అని కితాబిచ్చారు. ఇప్పుడామె ఘనతపరంగా ఎవరికీ తక్కువ కాదని, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు ఇచ్చిన గౌరవమే సైనాకూ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం సానియా మీర్జాను రాష్ట్రానికి బ్రాండ్ అంబాసడార్ గా నియమించిన విధంగానే, సైనాకు కూడా గుర్తింపునివ్వాలని అన్నారు.