: గోవధపై దేశవ్యాప్త నిషేధానికి ప్రయత్నిస్తున్నాం: రాజ్ నాథ్
బీజేపీ కేంద్రంలో పగ్గాలు అందుకున్న తర్వాత మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాలు గోవధపై నిషేధాన్ని విధించడం తెలిసిందే. ఇదే అంశంపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. గోవధపై దేశవ్యాప్త నిషేధం విధించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మధ్యప్రదేశ్ లో ఆధ్యాత్మికవేత్తలనుద్దేశించి ప్రసంగిస్తూ, ఆవులను సంహరించడాన్ని దేశంలో అనుమతించలేమని అన్నారు. దీన్ని నిషేధించడానికి సర్వశక్తులు ఒడ్డుతామని, ఈ విషయంలో ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తామని తెలిపారు. భారత్ ప్రపంచంలో పశు మాంసం ఎగుమతిలో రెండో స్థానంలో ఉండగా, వినియోగంలో ఐదో స్థానంలో ఉంది.