: రాహుల్ గాంధీకి భివాండీ కోర్టు సమన్లు
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి మహారాష్ట్రలోని భివాండీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. ఆర్ఎస్ఎస్ నేత రాజేష్ కుంటే దాఖలు చేసిన పరువు నష్టం కేసులో రాహుల్ కోర్టుకు గైర్హాజరవడంతో కోర్టు సమన్లు ఇచ్చింది. అయితే వ్యక్తిగత కారణాల రీత్యా హాజరుకాలేకపోతున్నారంటూ రాహుల్ న్యాయవాది దాఖలుచేసిన పిటిషణ్ ను న్యాయస్థానం తిరస్కరించింది. మే 8న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. గతేడాది లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్ పై పరువునష్టం కేసు దాఖలైంది.