: కాశ్మీర్ వరద పరిస్థితిపై ప్రధాని సమీక్ష


జమ్ము కాశ్మీర్ లో వరద పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమీక్షించారు. వెంటనే శ్రీనగర్ వెళ్లి వరద పరిస్థితిని పర్యవేక్షించాలని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీని ఆదేశించారు. మరోవైపు కాశ్మీర్ ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. వరద ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. లాదెన్ గ్రామంలో వర్షం కారణంగా ఓ ఇల్లు కూలి 21 మంది గల్లంతయ్యారు. శ్రీనగర్ వద్ద ప్రమాదస్థాయిని మించి జీలం నది ప్రవహిస్తుండటంతో తీర ప్రాంతవాసులను అధికారులు ఖాళీ చేస్తున్నారు. శ్రీనగర్ లోని జేవీఎంసీ ఆసుపత్రిలో వరద నీరు చేరడంతో రోగులను తరలించారు. బుడ్గాం జిల్లాలోని ఓ ప్రాంతంలో రెండు ఇళ్లు నీట మునిగి 16 మంది వరదలో చిక్కుకున్నారు.

  • Loading...

More Telugu News