: జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు 249 రోజుల గడువు కోరిన టీ ప్రభుత్వం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఎన్నికల నిర్వహణకు సుమారు 249 రోజుల సమయం ఇవ్వాలని ప్రభుత్వం పిటిషన్ రూపంలో కోరింది. డిసెంబరు నాటికి ఎన్నికలు నిర్వహిస్తామని ధర్మాసనానికి తెలిపింది. వార్డుల పునర్విభజన ప్రక్రియ నడుస్తోందని, ఇందుకోసం ఇటీవలే జీవో జారీ చేశామని పేర్కొంది. ఇటీవలే ఐఏఎస్ ల కేటాయింపు జరిగిందని న్యాయస్థానానికి సర్కారు వివరించింది. ఇదంతా విన్న కోర్టు అంత సమయం ఇవ్వలేమని స్పష్టం చేసింది. అన్ని అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.