: 450 సిక్సర్లు.. 2109 ఫోర్లు... బ్యాట్స్ మెన్ దే హవా!


ప్రపంచ కప్ చరిత్రలో ఎన్నడూ లేనన్ని పరుగులు నిన్నటితో ముగిసిన ఐసీసీ వరల్డ్ కప్ 2015 పోరులో నమోదయ్యాయి. అత్యధిక సెంచరీలు, అత్యధిక ఫోర్లు, అత్యధిక సిక్స్ లు నమోదైన వరల్డ్ కప్ పోటీలు ఇవే కావడం విశేషం. ఈ మెగా ఈవెంట్ లో బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ లను రూపొందించడంతో బ్యాట్స్ మెన్ తమ హవా చూపారు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. ఈ ప్రపంచ కప్ లో మొత్తం 21,614 పరుగులు వచ్చాయి. వీటిల్లో సగానికి పైగా బౌండరీల రూపంలో (11,136 పరుగులు) వచ్చాయి. మొత్తం 450 సిక్సర్లు, 2109 ఫోర్లు నమోదయ్యాయి. ఆటగాళ్లంతా కలసి 38 సెంచరీలు, 107 హాఫ్ సెంచరీలు చేశారు. బౌలర్లు 687 వికెట్లు పడగొట్టగా, అందులో 497 సార్లు క్యాచ్ ల రూపంలో ఆటగాళ్లు అవుట్ అయ్యారు.

  • Loading...

More Telugu News