: యెమెన్‌ లో భయం భయం... చిక్కుకున్న 3,500 మంది భారతీయులు


యెమెన్‌ లో వివిధ ఉద్యోగాలు, పనుల నిమిత్తం వెళ్ళిన సుమారు 3,500 మంది అక్కడ చిక్కుకున్నారు. తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా, సౌదీ అరేబియా వైమానిక దాడులు కొనసాగుతుండటంతో అక్కడ భయాందోళనలు నెలకొన్నాయి. అక్కడ చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ ఉదయం ప్రత్యేక విమానాన్ని పంపింది. దీనికి అదనంగా, 1500 మందిని తరలించే సామర్థ్యం ఉన్న నౌకను పంపే ఆలోచనలో ఉన్నట్టు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.

  • Loading...

More Telugu News