: ఇండియన్ సూపర్ సిరీస్ పురుషుల విజేత కిదాంబి శ్రీకాంత్
ఢిల్లీలో జరుగుతున్న ఇండియన్ సూపర్ సిరీస్ లో కిదాంబి శ్రీకాంత్ ఘన విజయం సాధించాడు. ఈ సిరీస్ ఫైనల్ లో విక్టర్ అక్సెల్ సెన్సపై 18-21, 21-13, 21-13 తేడాతో గెలుపొంది పురుషుల టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. తొలిసారిగా ఇండియన్ సూపర్ సిరీస్ ను శ్రీకాంత్ దక్కించుకున్నాడు. అతని కెరీర్ లో ఇది నాలుగవ టైటిల్.