: బాణాసంచా పేలుడు ఘటనపై సీఎం దిగ్భ్రాంతి


విశాఖ జిల్లా గోకులపాడులోని బాణాసంచా కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు వైద్యం అందించాలని ఆదేశించారు. మరోవైపు ఘటనపై మంత్రులు చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం కోసం కార్పోరేట్ ఆసుపత్రికి తరలించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి అయ్యన్నపాత్రుడు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అక్కడివారితో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. ఘటనాస్థలంలో మంటలు అదుపులోకి రాగా, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News