: 'లైఫ్ ఆఫ్ పై' నటుడుకి మరో అవకాశం
బాలీవుడ్ నటులతో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రం 'లైఫ్ ఆఫ్ పై'. నాలుగు ఆస్కార్ అవార్డులు కొల్లగొట్టిన ఈ చిత్రానికి ఆంగ్ లీ దర్శకత్వం వహించాడు. ఇందులో 16 సంవత్సరాల 'పై'గా నటించిన ఢిల్లీకి చెందిన కుర్రాడు సూరజ్ శర్మ అందరికీ గుర్తుండే ఉంటాడు. చిత్రంలో తన నటనకు పలువురి నుంచి ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా సూరజ్ కి డిస్నీ బేస్ బాల్ డ్రామా 'మిలియన్ డాలర్ ఆర్మ్' చిత్రంలో అవకాశం ఇచ్చింది. దీనిలో ఈ కుర్రాడు 'జాన్ హామ్' అనే ప్రధాన పాత్ర పోషించనున్నాడు. ఆస్ట్రేలియన్ దర్శకుడు క్రెగ్ గిలెస్పీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.