: ఆనాటి చరిత్ర పునరావృతం అయితే న్యూజిలాండ్ దే విజయం!


1983 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ గుర్తుందా? మన కపిల్ దేవ్ సేన తొలి వరల్డ్ కప్ సాధించిన రోజు. ఆనాడు జరిగిన చరిత్ర పునరావృతం అయితే నేటి మ్యాచ్ లో న్యూజిలాండ్ దే విజయం. అప్పట్లో వెస్టిండీస్‌ తో జరిగిన ఫైనల్లో టీమ్ ఇండియా 183 పరుగులకే ఆలౌటైంది. సునాయాస లక్ష్యం అనుకుంటూ, టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన వెస్టిండీస్‌ ను 184 పరుగులు చేయకుండా ఇండియా అడ్డుకోగలిగింది. ఇక నేటి మ్యాచ్ లో కివీస్ జట్టు కూడా 183 పరుగులకు ఆలౌటైంది. మరి కివీస్ జట్టు కపిల్ సేన నుంచి స్ఫూర్తి పొంది చరిత్రను పునరావృతం చేస్తుందా? అన్న విషయం మరో రెండు మూడు గంటల్లో తేలుతుంది.

  • Loading...

More Telugu News