: వెంట వెంటనే పడిన వికెట్లు... కష్టాల్లో న్యూజిలాండ్... భారీ స్కోర్ డౌటే!
ఆదిలోనే 3 వికెట్లు కోల్పోయి, ఆపై నిలకడగా ఆడుతున్న న్యూజిలాండ్ కష్టాలు 36వ ఓవర్లో మరింతగా పెరిగాయి. ఫాల్కనర్ వేసిన ఈ ఓవర్ తొలి బంతికి 40 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద టేలర్ (72 బంతుల్లో 2 ఫోర్లు) అవుట్ కాగా, మూడవ బంతికి అండర్సన్ డక్కౌట్ అయ్యాడు. తదుపరి స్టార్క్ వేసిన 37వ ఓవర్ రెండో బంతికి రోంచీ కూడా డక్కౌట్ అయ్యాడు. మరో ఎండ్ లో ఇల్లియాట్ 72 పరుగులతో ఆడుతున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోర్ 36.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 151 పరుగులు. మరో 13 ఓవర్లు మాత్రమే మిగిలి ఉండడంతో, జట్టు స్కోర్ 300 పరుగులకు చేరడం కష్టమే.