: త్వరలో హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ ఐపీవో


దేశవాళీ ప్రైవేట్ బీమా రంగంలో రెండో అతిపెద్ద సంస్థగా సేవలందిస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ త్వరలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌ (ఐపీవో)కు రానుంది. ఐపీవో ద్వారా 10 శాతం వాటాలను విక్రయించి సుమారు రూ. 2,400 కోట్ల మేరకు నిధులు సేకరించాలని హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పబ్లిక్ ఇష్యూ నిర్వహణ బాధ్యతలను అంతర్జాతీయ ఇన్వెస్ట్‌ మెంట్ బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ అమెరికా, జేపీ మోర్గాన్, క్రెడిట్ సూయిజ్, మోర్గాన్ స్టాన్లీలకు అప్పగించినట్లు సమాచారం. కాగా, ఐపీవో జూలై-సెప్టెంబర్ మధ్యకాలంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News