: వీరి టైం అయిపోయింది!... నేడు పదవీ విరమణ చేయనున్న పలువురు ఎమ్మెల్సీలు
తెలంగాణ ఎమ్మెల్సీలలో పలువురు నేడు పదవీ విరమణ చేయనున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన డీ శ్రీనివాస్ (కాంగ్రెస్), షబ్బీర్ అహ్మద్ (కాంగ్రెస్), కేఆర్ ఆమోస్ (కాంగ్రెస్), ఎన్ రాజలింగం (కాంగ్రెస్), కే యాదవరెడ్డి (కాంగ్రెస్), బీ.లక్ష్మీనారాయణ (టీఆర్‌ఎస్), బీ వెంకటేశ్వర్లు (టీఆర్‌ఎస్) నేడు శాసనమండలికి వీడ్కోలు పలకనున్నారు. వీరితోపాటు గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఎన్నికైన బీ.వెంకట్రావు (నిజామాబాద్), పట్టభద్రుల నియోజక వర్గాల కోటాలో గెలుపొందిన కే.నాగేశ్వర్ (హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్), కపిలవాయి దిలీప్‌కుమార్ (నల్గొండ-ఖమ్మం-వరంగల్)లు కూడా పదవీ విరమణ చేయనున్నారు.