: పీఎస్ఎల్వీ సి27 ప్రయోగం గ్రాండ్ సక్సెస్


భారత నావిగేషన్ వ్యవస్థకు తోడ్పాటునందించే ఐఆర్ఎన్ఎస్ఎస్ 1డి ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ సి27 రాకెట్ విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. కొద్ది సేపటి క్రితం నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ రాకెట్ వివిధ దశలను విజయవంతంగా అధిగమించింది. సొంత నావిగేషన్ వ్యవస్థతో అమెరికాతో సమానంగా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. విపత్తులను గుర్తించడం, నౌకలు, వాహనాల రాకపోకలను తెలుసుకోవడం ఈ నావిగేషన్ వ్యవస్థ ద్వారా సాధ్యమవుతుంది. భారత నావిగేషన్ వ్యవస్థ కోసం మొత్తం ఏడు ఉపగ్రహాలు అవసరం కాగా, ఇప్పటికి నాలుగు ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. మిగిలిన మూడింటిని కూడా ఈ ఏడాదే ప్రయోగిస్తామని ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలు అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయంతో మరోసారి సత్తా చాటామన్నారు. ఇస్రోకు గాంధీ శాంతి బహుమతి ప్రకటించడం సంతోషదాయకమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News