: ఈ మూడు విద్యాసంస్థలు మహా విద్యాలయాలుగా మారతాయి: చంద్రబాబు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాకలో ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎస్ఈఆర్ విద్యాసంస్థలకు శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో మాట్లాడుతూ... నిన్నటి వరకు తిరుపతి అంటే వెంకటేశ్వరస్వామి గుర్తొచ్చేవారని, ఇప్పుడు అక్కడికి సరస్వతి ఆలయం కూడా వచ్చి చేరిందని అన్నారు. ఈ మూడు విద్యాసంస్థలు మహా విద్యాలయాలుగా మారతాయని ఉద్ఘాటించారు. భవిష్యత్తులో తిరుపతి ప్రాంతం ఎడ్యుకేషన్ హబ్ గా మారుతుందని తెలిపారు. ఈ ప్రాంతంలో గతంలో ఎన్నడూ చూడని ఉత్సాహం కనిపిస్తోందని పేర్కొన్నారు. మనకు రాజధాని లేదు, ఏమీ లేవు అని, అన్నీ సమకూర్చుకోవాలి అని పేర్కొన్నారు. ఏపీని భవిష్యత్తులో నెంబర్ వన్ గా మార్చే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ సహకరిస్తారని, వెంకయ్యనాయుడు చొరవతో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని చంద్రబాబు తెలిపారు. విభజన సందర్భంగా రాజ్యసభలో పోరాడిన వ్యక్తి వెంకయ్యనాయుడు అని కొనియాడారు. మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచంలో అగ్రగామి అవుతుందని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. స్కిల్ డెవలప్ మెంట్ కోసం కేంద్రం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. మరో నాలుగేళ్లలో రాష్ట్రం ఎడ్యుకేషన్ హబ్ గా మారుతుందన్నారు. 2029 కల్లా దేశంలో ఏపీ నెంబర్ వన్ అవుతుందని, 2050 నాటికి ప్రపంచంలోనే టాప్ కి చేరుతుందని పునరుద్ఘాటించారు.

  • Loading...

More Telugu News