: చెరువులు ఆకాశంలో తవ్వగలమా?: వెంకయ్యనాయుడు


చిత్తూరు జిల్లా మేర్లపాకలో మూడు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలకు భూమిపూజ అనంతరం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తనదైన శైలిలో ప్రసంగించారు. భూసేకరణ అవసరాన్ని నొక్కి చెప్పారు. అభివృద్ధి చెందాలంటే ప్రాజెక్టులు, పరిశ్రమలు, రహదారులు అవసరమని అన్నారు. అందుకు భూమి కావాలని, భూసేకరణ ద్వారానే అది సాధ్యమని వివరించారు. అయితే, కొందరు భూసేకరణపై అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. రోడ్లు వేయాలంటే భూమి కావాలని, పరిశ్రమలు కట్టాలంటే భూమి కావాలని, చెరువులు తవ్వాలంటే భూమి కావాలని పేర్కొన్నారు. అలా కాకుండా భూమితో పనిలేకుండా చెరువులు ఆకాశంలో తవ్వగలమా? అని ప్రశ్నించారు. అందుకే, భూసేకరణకు అందరూ సహకరించాలని సూచించారు.

  • Loading...

More Telugu News