: సరస్వతి ఉంటే లక్ష్మీదేవి వస్తుంది... అందరూ తెలుసుకోవాలి: వెంకయ్యనాయుడు


కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చిత్తూరు జిల్లా మేర్లపాకలో మూడు విద్యాసంస్థల భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. మూడు విద్యాసంస్థలు ఇక్కడ ఏర్పాటు కానుండడం త్రివేణి సంగమంలా అనిపిస్తోందన్నారు. రామరాజ్యం రావాల్సిన ఆవశ్యకతను వివరించారు. రామరాజ్యం అంటే... ఆకలి లేనిది, అవినీతి లేనిది, అరాచకాలు లేనిది అని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ... ఆంగ్లం నేర్చుకోండి, మాతృభాషను మాత్రం మరిచిపోవద్దని సూచించారు. జన్మభూమి, మాతృభాషను మరిచిన వాడు మనిషే కాదని సూత్రీకరించారు. విదేశాలకు వెళ్లడం తప్పుకాదని, జ్ఞానం పెంచుకునేందుకు వెళ్లాలని హితవు పలికారు. గో, లెర్న్, ఎర్న్, రిటర్న్ అనే విషయాలను విద్యార్థులందరూ గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. సరస్వతి (చదువు) ఉంటే లక్ష్మీదేవి (డబ్బు) వస్తుందని తనదైన శైలిలో వ్యాఖ్యానించి నవ్వులు పూయించారు.

  • Loading...

More Telugu News