: నా మాటలను ఎవరైనా అనువదిస్తారా?: మేర్లపాకలో స్మృతీ ఇరానీ


చిత్తూరు జిల్లా మేర్లపాకలో ఒకే చోట మూడు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలకు శంకుస్థాపన చేసిన అనంతరం కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆంగ్లంలో మాట్లాడారు. అయితే, తొలుత వేదికపై ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, మంత్రిమండలి సహచరుడు సుజనా చౌదరిలకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపిన ఆమె, అనంతరం, తన మాటలను తెలుగులోకి ఎవరైనా తర్జుమా చేయగలరా? అని కోరారు. అయితే, అందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఇంగ్లీషులోనే కొనసాగించారు. ఇక్కడి విద్యాసంస్థలు బాగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. తిరుపతి ఐఐటీగా ఇక్కడి విద్యాసంస్థ దేశంలోనే ప్రముఖ విద్యాసంస్థగా వినుతికెక్కాలని కోరుకుంటున్నానని తెలిపారు. అంతకుముందు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఏపీని ఎడ్యుకేషన్ హబ్ గా చేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు కల అని ఉద్ఘాటించారు. నాణ్యమైన విద్య అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇక, ఒకే చోటు మూడు విద్యాసంస్థలకు ఏకకాలంలో భూమి పూజ ఇదే ప్రథమమని తెలిపారు.

  • Loading...

More Telugu News