: చూస్కో... నా పేరు మార్మోగుతుంది: ప్రియురాలితో చెప్పిన 'జర్మన్ వింగ్స్' కో పైలెట్


జర్మన్ వింగ్స్ ఎయిర్ లైన్స్ విమానాన్ని ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో ఉద్దేశపూర్వకంగా ప్రమాదానికి గురిచేసిన కో పైలెట్ ఆండ్రియాస్ లూబిట్జ్ కు సంబంధించి మరో ఆసక్తికర విషయం వెల్లడైంది. ఏదో ఒకనాడు తన పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతుందని తన ప్రేయసితో చెప్పినట్టు తెలిసింది. లూబిట్జ్ ప్రేయసి మరియా ఈ విషయం తెలిపింది. ఎయిర్ హోస్టెస్ అయిన మరియా కొన్నాళ్లపాటు లూబిట్జ్ తో ప్రేమాయణం సాగించింది. అయితే, అతని మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఆమె తమ అనుబంధానికి గుడ్ బై చెప్పింది. లూబిట్జ్ డిప్రెషన్ లో కూరుకుపోయాడని, ఓ దశలో విపరీతంగా వ్యవహరించేవాడని ఆమె ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. తాజాగా, విమానం కూలిపోయిన వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపింది. దీంతో, లూబిట్జ్ అప్పట్లో అన్న మాటలు ఇప్పుడు గుర్తొచ్చాయని వివరించింది.

  • Loading...

More Telugu News