: చితి మంటల వెలుగులో సెక్స్ వర్కర్ల ఆనంద తాండవం


దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి లభించిన అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు చెప్పండి? అది కూడా హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావించే వారణాసిలోనైతే చెప్పనక్కర్లేదు. భగవదనుగ్రహం కోసం అక్కడ ఏ పనైనా సంతోషంగా చేస్తారు. ప్రతి ఏడాది చైత్ర నవరాత్రుల సందర్భంగా ఏడవ రాత్రి మణికర్ణిక ఘాట్ లోని మహాశ్మశాన్ నాథ్ ఆలయంలో సెక్స్ వర్కర్లందరూ పెద్ద ఎత్తున గుమిగూడతారు. అనంతరం, అక్కడి చితి మంటల వెలుగులో వారందరూ నర్తిస్తారు. ఆ సృష్టి లయకారుడి శాంతి కోసం ఆనంద తాండవం చేస్తారు. తాజాగా, ఈ క్రతువులో పాల్గొన్న సెక్స్ వర్కర్లు బాలీవుడ్ హిట్ గీతాలకు డ్యాన్సులు చేశారు. దీని గురించి వార్షిక నాట్య క్రతువు నిర్వాహకుడు గుల్షన్ కపూర్ మాట్లాడుతూ, కాశీలో చావు అన్నది చింతించాల్సిన విషయం కాదని చాటడమే ఈ వేడుక నిర్వహించడం వెనుక ప్రధాన ఉద్దేశమని వివరించారు. కాగా, ఈ క్రతువులో భాగంగా, తొలుత 8 గంటల ప్రాంతంలో మందిరం లోపల డ్యాన్సు చేస్తారు. అది దేవుడి కోసం! అనంతరం, స్థానికులు, విదేశీ యాత్రికులు ఆ సెక్స్ వర్కర్లతో జత కలుస్తారు. అర్థరాత్రి వరకు ఈ ఉత్సవ హేల కొనసాగుతుంది.

  • Loading...

More Telugu News