: పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్, కేఈ, మాణిక్యాలరావు


శ్రీరామనవమి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన భద్రాచలం, ఒంటిమిట్ట, రామతీర్థంలో శ్రీరాముని కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భద్రాచలంలో జరిగిన శ్రీరామ కల్యాణోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టువస్త్రాలు సమర్పించగా, ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రంలోని శ్రీరామ కల్యాణానికి ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తులు పోటెత్తడంతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి.

  • Loading...

More Telugu News