: 120 రోజుల అడ్వాన్స్ రిజర్వేషన్ కు రైల్వే ఏర్పాట్లు


దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా 120 రోజుల మందు రిజర్వేషన్ చేసుకునే సౌకర్యాన్ని రైల్వే శాఖ అందుబాటులోకి తేనుంది. ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్న ఈ విధానంతో ప్రయాణాలకు వీలైనంత ముందుగా ప్రణాళికలు రచించుకుని తీరిగ్గా విహరించే వెసులుబాటు రైల్వే శాఖ కల్పించనుంది. దీంతో తొలిరోజు రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు బారులుతీరే అవకాశం ఉందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. దీంతో జోన్ లోని అన్ని రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద అదనపు సిబ్బందిని నియమించింది. రిజర్వేషన్ సౌకర్యం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకున్నట్టు రైల్వే శాఖాధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News