: కారుతో ఐదుగుర్ని ఢీ కొట్టాడు...ఆసుపత్రి నుంచి పారిపోయాడు!


హైదరాబాదులో తప్పతాగిన మైకంలో తన కారుతో ఒక బైక్ ను, రెండు కార్లను ఢీ కొట్టాడు. తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సదరు వ్యక్తి పారిపోయిన ఘటన చోటుచేసుకుంది. హైదరాబాదు శివారు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మధ్యప్రదేశ్, భోపాల్ సమీపంలోని సాగర్ గ్రామానికి చెందిన సోనీరాం చందానీ (36), హరీష్ ప్రసాద్ (40) ప్రేమవివాహం చేసుకుని మాదాపూర్ లోని విఠల్ రావు నగర్ లో ఉంటున్నారు. భార్య, తనయుడు మోక్ష (4) లతో కలిసి హరీష్ ప్రసాద్ నానక్ రాం గూడ నుంచి గచ్చిబౌలి వైపు ఔటర్ రింగ్ రోడ్డుపై వస్తూ, సిగ్నల్ పడడంతో గచ్చిబౌలి దగ్గర ఆగారు. ఇంతలో వెనుకగా వచ్చిన స్కోడా (టీఎస్09ఈసీ9599) కారు బలంగా ఢీ కొట్టింది. దీంతో ఎగిరిపడ్డ ప్రసాద్ కుటుంబాన్ని గుద్దుకుంటూ ముందున్న హోండా సిటీ, ఇన్నోవా కార్లను ఢీ కొట్టింది. దీంతో సోనీ, మోక్ష, ప్రసాద్ లతో, హోండా సిటీలో ఉన్న ఓ మహిళ, పురుషుడు, స్కోడా కారులోని శ్వేతాబ్ కుమార్, వినోద్, రిషబ్, శ్రీవాత్సవ గాయపడ్డారు. వారిని స్థానికులు హిమగిరి ఆసుపత్రికి తరలించారు. సోనీ కాసేపటికే మృతి చెందగా, ప్రసాద్, మోక్ష తీవ్రగాయాలపాలయ్యారు. స్వల్పగాయాలపాలైన హోండా సిటీలో వారు చికిత్స చేయించుకుని ఇళ్లకు వెళ్లారు. ఇంతలో అందర్నీ స్కోడా కారుతో ఢీ కొట్టిన శ్వేతాబ్ కుమార్ (డెలాయిట్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్) కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పారిపోయాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News