: ప్రియురాలు వదిలేయడంతో... సైకోగా మారి విమానం కూల్చేశాడట!
జర్మన్ వింగ్స్ విమానాన్ని ఆల్ఫ్స్ పర్వతాలకు ఢీ కొట్టి 150 మంది దుర్మరణానికి కారణమైన కో పైలట్ ఆండ్రియాస్ లూబిట్జ్ గురించి బిల్డ్ అనే జర్మన్ దినపత్రిక ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. బిల్డ్ పత్రిక కథనం ప్రకారం... లూబిట్జ్ ఫ్లాట్ ను పోలీసులు సోదా చేశారు. ఈ సందర్భంగా దొరికిన పత్రాలు ఆయన మానసిక రోగానికి గురయ్యాడని నిర్ధారిస్తున్నాయి. దీంతో, లుఫ్తాన్సా విమానయాన సంస్థ తరపున అమెరికాలోని ఆరిజోనాలో పైలట్ శిక్షణ తీసుకునే సమయంలో ఏడాదిపాటు సైకోథెరపీ చేయించుకున్నాడని అతని ఫ్లాట్ లో దొరికిన పత్రాలు చెబుతున్నాయట. అభిప్రాయ భేదాలతో అతని గర్ల్ ఫ్రెండ్ కూడా రెండు వారాల క్రితమే అతనిని వదిలేసిందట. దీంతో, మరోసారి మానసిక వ్యాధి తిరగబడింది. ఈ నేపథ్యంలో, మరోసారి సైకోథెరపీ చేయించుకుంటున్నాడట. ఈ క్రమంలోనే జర్మన్ వింగ్స్ విమానం పైలట్ బాత్రూమ్ కు వెళ్లడాన్ని ఆసరాగా తీసుకుని కాక్ పిట్ డోర్ లాక్ చేసి విమానాన్ని పర్వతాలకు ఢీకొట్టాడు.