: అక్కడ ప్రతి 20 మంది విద్యార్థుల్లో ఒకరు వ్యభిచారం చేసిన వాళ్లేనట!


యునైటెడ్ కింగ్ డమ్ లో ప్రతి 20 మంది విద్యార్థుల్లో ఒకరు విద్యాభ్యాసం సమయంలో వ్యభిచారం చేసిన వాళ్లేనని ఓ సర్వే చెబుతోంది. యూనివర్శిటీల్లో చదివేటప్పుడు ఫీజులు చెల్లించేందుకు, జీవన వ్యయం నిమిత్తం అమ్మాయిలు, అబ్బాయిల్లో కొందరు వ్యభిచరించారని స్టూడెంట్ సెక్స్ వర్క్ ప్రాజెక్టు నివేదిక పేర్కొంది. ఎక్కువగా అబ్బాయిలే వ్యభిచారం, ఎస్కార్టింగ్, స్ట్రిప్పింగ్, ఆన్ లైన్ టీజింగ్ తదితర కార్యక్రమాలకు పాల్పడ్డారట. స్వాన్ సీ విశ్వవిద్యాలయానికి చెందిన సెంటర్ ఫర్ క్రిమినల్ జస్టిస్ అండ్ క్రిమినాలజీ పరిశోధకులు ఈ సర్వే చేపట్టారు. అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించే క్రమంలో విద్యార్థుల్లో అత్యధికులు గుట్టుగా ఈ పనిచేసేవారని అధ్యయనానికి నాయకత్వం వహించిన ట్రేసీ సగర్ తెలిపారు. మొత్తం 6,750 మంది విద్యార్థులను ప్రశ్నించగా, వారిలో 5 శాతం మంది అబ్బాయిలు, 3.5 శాతం మంది అబ్బాయిలు సెక్స్ ఇండస్ట్రీలో పనిచేశామని తెలిపారట.

  • Loading...

More Telugu News