: ఒడిశాలో గడచిన ఏడాది 2,011 రేప్ కేసులు
ఒడిశాలో ఏటికేడు అత్యాచార బాధితులు పెరిగిపోతున్నారు. కామాంధుల కోరికల అగ్నిలో అబలలు సమిధలవుతున్నారని అత్యాచారాలపై ఒడిశా ప్రభుత్వం విడుదల చేసిన స్వేత పత్రంలో పేర్కొంది. గడచిన ఏడాది 2,011 రేప్ కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రంలో పేర్కొంది. 2014వ సంవత్సరంలో అత్యాచార ఘటనలతో పాటు రాష్ట్రంలో 93,657 క్రిమినల్ కేసులు నమోదైనట్టు వెల్లడించింది. 2013లో 1,832 రేప్ కేసులు, 90,184 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని శ్వేతపత్రంలో ప్రభుత్వం తెలిపింది. ఏటికేడు అత్యాచార కేసుల సంఖ్య పెరుగుతోందని ఒడిశా ప్రభుత్వం నిస్సహాయత వ్యక్తం చేసింది.