: రాజేంద్ర ప్రసాద్ 5 కోట్లిస్తే...వైదొలగిపోతాం: హేమ
'మా' అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న సినీ నటుడు రాజేంద్రప్రసాద్ 5 కోట్ల రూపాయలు 'మా' పేరిట అకౌంట్ లో వేస్తే తామంతా వైదొలగుతామని క్యారెక్టర్ ఆర్టిస్టు హేమ సవాలు విసిరింది. ఆయన 'మా' అకౌంట్లో డబ్బులు ఎప్పుడు వేస్తారో చెప్పాలని హేమ అడిగింది. హైదరాబాదులో మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా మాట్లాడుతూ, గతంలో 'మా' అధ్యక్షులు ఏం చేశారో అందరికీ తెలుసని చెప్పింది. 'మా'కు అదిచేస్తాం, ఇది చేస్తాం అని చెప్పడం కాదని, తామంతా మంచి చేసేందుకే ముందుకు వచ్చామని హేమ తెలిపింది.