: తెలంగాణలో రేపటి నుంచి మే 31 వరకు ఇంటర్ సెలవులు
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ కాలేజీలకు రేపటి నుంచి మే 31 వరకు సెలవులు అమలు కానున్నాయి. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు నేటి మధ్యాహ్నం వెల్లడించింది. 2015-16 విద్యా సంవత్సరం జూన్ 1 నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొంది. అన్ని జూనియర్ కాలేజీల యాజమాన్యాలు సెలవు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు హెచ్చరించింది.