: కోహ్లీ ఫెయిల్ అయితే అనుష్క జవాబుదారీనా?: గంగూలీ
ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఫెయిల్ అయితే దానికి అనుష్క ఎలా జవాబుదారీ అవుతుందని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశ్నించాడు. సెమీఫైనల్ లో ఆస్ట్రేలియాపై ఓటమి అనంతరం సామాజిక మాధ్యమంలో కోహ్లీ వైఫల్యానికి అతడి ప్రియురాలు అనుష్క శర్మ కారణమంటూ వస్తున్న విమర్శలపై గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కోహ్లీ ప్రేమలో పడటం కూడా తప్పేనా? అని గంగూలీ ప్రశ్నించాడు. అనుష్కపై వ్యాఖ్యలు బాధ కలిగించేలా ఉన్నాయని అన్నాడు. ఇతర క్రికెటర్ల కుటుంబ సభ్యుల్లాగే అనుష్క కూడా సిడ్నీ చేరుకుందని గంగూలీ మద్దతుగా మాట్లాడాడు. కోహ్లీ వైఫల్యానికి ఆమెను బాధ్యురాలిని చేయడం అపరిపక్వతకు నిదర్శనం అని గంగూలీ తెలిపాడు.