: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిరవధిక వాయిదా
ఏపీ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. ద్రవ్య వినిమయ బిల్లుకు ఈరోజు సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. మరోవైపు, అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరును విశ్లేషించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేశారు. కమిటీలో పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు, పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర, రావుల చంద్రశేఖర్ రెడ్డిలను సభ్యులుగా నియమించారు.