: ఫార్చూన్ శక్తిమంతుల జాబితాలో మోదీ, కైలాశ్ సత్యార్థి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత కైలాశ్ సత్యార్థిలు ప్రపంచ శక్తిమంతుల జాబితాలో నిలిచారు. ఫార్చూన్ మ్యాగజైన్-2015 సంవత్సరానికిగానూ 50 మందితో ఓ జాబితా విడుదల చేసింది. అందులో వారిద్దరూ ఉన్నారు. ఇందులో మోదీకి ఐదో స్థానం లభించగా, సత్యార్థి 28వ స్థానం దక్కించుకున్నారు. ఇదే జాబితాలో యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ తొలిస్థానంలో నిలిచారు. భారత నేత (మోదీ) ఎన్నికల్లో ఇచ్చిన తన హామీలను అమలు చేయడం ప్రారంభించారని, ప్రపంచంలో భారత్ ను అగ్రపథాన నిలిపేందుకు తనదైన కృషి చేస్తున్నారని ఫార్చూన్ పేర్కొంది. ఇక దేశీయంగా, అంతర్జాతీయంగా కష్ట పరిస్థితులు ఎదుర్కొన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వరుసగా రెండవసారి జాబితాలో చోటు దక్కించుకోలేకపోయినట్టు ఫార్చూన్ పేర్కొంది.