: ఆనాడు కట్టుబట్టలతో వచ్చారు... ఈనాడు భయపడుతున్నారు: ఉద్యోగులపై చంద్రబాబు
మద్రాసు నుంచి రాజధాని కర్నూలుకు మారినప్పుడు ప్రభుత్వ అధికారులు కట్టుబట్టలతో వచ్చారని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఇప్పుడు హైదరాబాద్ నుంచి కొత్త రాజధానికి వచ్చేందుకు అధికారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని అన్నారు. ఈ ఉదయం ఆయన శాసనమండలిలో మాట్లాడుతూ, త్వరలోనే రాజధాని ప్రాంతంలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేస్తామని వివరించారు. సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వ ఉద్యోగులు విజయవాడ ప్రాంతానికి తరలి వెళ్లాలని కోరారు. పిల్లల చదువులు, హైదరాబాదు పరిస్థితులకు అలవాటుపడడం తదితర కారణాలతో, రాజధాని ప్రాంతానికి రమ్మంటే అధికారులు భయపడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. కొత్త రాజధానిపై ఇష్టాన్ని పెంచుకోవాలని అధికారులకు ఆయన పిలుపునిచ్చారు.