: టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుపై ఎర్రబెల్లి వ్యాఖ్యలు
నల్గొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలవడంపై టీ.టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహనరావు తీవ్ర పోటీ ఇవ్వడంతో రెండో ప్రాధాన్యత ఓట్లలో పల్లా గెలవడం టీఆర్ఎస్ కు సిగ్గుచేటన్నారు. 'అదీ ఓ గెలుపేనా?' అని వ్యంగ్యంగా మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఎర్రబెల్లి ఆరోపించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ మరిచారన్న ఆయన, సభలో నిరసన తెలిపే హక్కు ప్రతిపక్షాలకు ఉందని స్పష్టం చేశారు.