: అవును, పెళ్లి చేసుకోబోతున్నా... చాలా సంతోషంగా ఉన్నా!: షాహిద్ కపూర్


తాను పెళ్లి చేసుకోబోతున్నానంటూ మీడియాలో వచ్చిన వార్తలను బాలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో షాహిద్ కపూర్ ధ్రువీకరించాడు. ముంబయిలో ఓ అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న షాహిద్ ను వివాహం విషయంపై మీడియా ప్రతినిధులు అడగ్గా అవునని సమాధానమిచ్చాడు. "నా పెళ్లి గురించి మీరంతా ఏదైతే విన్నారో అది నిజమే. ఇంకా ఎంగేజ్ మెంట్ కాలేదు. వివాహం ఈ ఏడాది చివర్లో ఉండవచ్చు" అని షాహిద్ వివరించాడు. అయితే తను చేసుకోబోతున్న అమ్మాయి గురించి చెప్పమనగా, తను చాలా సాధారణమైన అమ్మాయని, తాను కూడా అంతేనన్నాడు. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానని, ఇంతకంటే ఎక్కువ చెప్పలేనని షాహిద్ ముక్తాయించాడు. ఢిల్లీకి చెందిన మీరా రాజ్ పుత్ అనే అమ్మాయిని ఈ బాలీవుడ్ హీరో పెళ్లి చేసుకోనున్నాడని, అతని కంటే ఆ అమ్మాయి 13 ఏళ్లు చిన్నదని మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News