: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో యువతి కిడ్నాప్... రక్షించిన పోలీసులు


బెంగళూరుకు చెందిన ఓ యువతిని కిడ్నాప్ చేసి రాజధాని ఎక్స్ ప్రెస్ ట్రైన్‌ లో తీసుకు వెళ్తుండగా సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కాపాడారు. ఆ యువతిని రాత్రి కిడ్నాప్ చేశారని ఈ ఉదయం రాజధాని ఎక్స్‌ ప్రెస్‌ లో తీసుకు వెళ్తున్నారని సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు బెంగళూరు నుంచి సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ట్రైన్ ఎస్కార్ట్‌ ను అలర్ట్ చేశారు. హైదరాబాదులో బయలుదేరిన ట్రైన్ సికింద్రాబాదుకు చేరుకునేలోపు హెచ్1 ఏసీ బోగీలో యువతి ఉన్నట్టు కనుగొన్నారు. యువతిని రక్షించి కిడ్నాపర్ నిజాంను అరెస్టు చేశారు. కేసును రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News