: విధినిర్వహణలో ప్రాణాలర్పించిన తొలి మహిళా లెఫ్టినెంట్ కిరణ్


లెఫ్టినెంట్ కిరణ్ షెకావత్... అంకితభావంతో పనిచేస్తూ, అనతికాలంలోనే ఉన్నతాధికారుల మన్ననలు పొందిన మహిళా. 2010లో నౌకాదళంలో చేరిన ఆమె విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. సెన్సార్స్ ఇన్ చార్జ్ గా ఉన్న ఆమె ప్రయాణిస్తున్న శిక్షణ విమానం రెండు రోజుల క్రితం సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం ఆ విమానాన్ని గుర్తించారు. కిరణ్ మృతదేహం విమానంలోనే ఉందని అధికారులు తెలిపారు. ఆమె బయటకురాలేని పరిస్థితుల్లో చిక్కుకుపోయిందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం జనవరి 26న ఆల్ వుమన్ ఆఫీసర్ కంటింజంట్ పరేడ్ లో కిరణ్ పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News