: సోమేశ్... మీరేమైనా మోనార్కా?: జీహెచ్ఎంసీ కమిషనర్ పై హైకోర్టు ఆగ్రహం!


ఆస్తి పన్ను వసూలు కోసం పన్ను బకాయిదారులకు విద్యుత్, నీటి కోతలు విధిస్తున్న గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ సోమేశ్ కుమార్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరేమైనా మోనార్కా? అంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్ గుప్తా నిలదీశారు. హైదరాబాదు నిజాంలా వ్యవహరిస్తున్నారంటూ ఆక్షేపించారు. చట్టం తెలియకుండా కమిషనర్ గా ఎలా కొనసాగుతున్నారంటూ ప్రశ్నించారు. ఇలాంటి పరిణామాలు మళ్లీ జరిగితే సహించేది లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఆస్తి పన్ను బకాయి పేరిట జీహెచ్ఎంసీ నీరు, విద్యుత్ కోతలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సందర్భంగా నిన్న హైకోర్టు ఈ మేరకు ఘాటుగా స్పందించింది. అత్యవసర సేవలైన విద్యుత్, నీటి సరఫరాలను ఎలా నిలిపివేస్తారంటూ చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం సోమేశ్ కుమార్ తరఫు న్యాయవాదిని నిలదీసింది. చట్టాన్ని అనుసరించి పాలనను సాగించాలని హితవు చెప్పిన కోర్టు, మరోమారు ఇలా జరిగితే సహించేది లేదని కాస్త కటువుగానే హెచ్చరికలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News