: వాజ్ పేయి ఇంటికెళ్లనున్న ‘భారతరత్న’... కృష్ణ మార్గ్ కు రాష్ట్రపతి, ప్రధాని!
దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న మాజీ ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు అటల్ బిహారీ వాజ్ పేయి ఇంటికి వెళ్లనుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ , ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన కేబినెట్ సభ్యులు, ఇతర ప్రముఖులు నేడు ఢిల్లీలోని కృష్ణమార్గ్ లో ఉన్న వాజ్ పేయి ఇంటికి వెళ్లనున్నారు. గతేడాది డిసెంబర్ లో వాజ్ పేయికి భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వృద్ధాప్యం, అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వాజ్ పేయి, ఇంటి గడప దాటి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఆయన పరిస్థితిని గమనించిన రాష్ట్రపతి ప్రొటోకాల్ ను పక్కనబెట్టి మాజీ ప్రధాని ఇంటికే వెళ్లి అవార్డును ప్రదానం చేసేందుకు సిద్ధపడ్డారు. దీనికి మోదీ ప్రభుత్వం కూడా మద్దతు పలకడంతో నేడు వాజ్ పేయికి భారతరత్నను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.