: టీమిండియా గెలవాలని నాలుక కోసుకున్న వీరాభిమాని


అభిమానానికి హద్దు ఉండాలని పెద్దలు చెబుతుంటారు. అభిమానం హద్దులు దాటితే ఎంతటి అనర్థాలకు దారితీస్తుందో ఈ సంఘటన చదివితే తెలుస్తుంది. తమిళనాడులోని వెల్లూరుకు చెందిన సుధాకర్ (21) టీమిండియాకు వీరాభిమాని. ప్రపంచకప్ లో భారత జట్టు అప్రతిహతంగా సెమీఫైనల్ కు చేరుకోవడంతో సంతోషంగా ఉన్నాడు. సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా ప్రత్యర్థి కావడంతో టీమిండియా విజయం సాధించాలని నాలుక కోసుకున్నాడు. అతడి దుశ్చర్యను గమనించిన బంధువులు, స్నేహితులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఆ హడావుడిలో తెగిపడిన నాలుక ముక్క తీసుకెళ్లకపోవడంతో మైక్రోసర్జరీ చేయడానికి వీలు కాలేదని వైద్యులు తెలిపారు. అయితే ప్లాస్టిక్ సర్జరీ చేసి నాలుకను అమర్చే ప్రయత్నం చేస్తామని వారు వెల్లడించారు. సుధాకర్ నోట్లో కత్తిపెట్టుకుని బొప్పాయి చెట్టు ఎక్కుతుండగా నాలుక తెగిపడిందని వైద్యులకు తెలిపినట్టు వారు చెప్పారు. గట్టిగా నిలదీయడంతో అసలు విషయం వెలుగు చూసింది.

  • Loading...

More Telugu News