: సినిమాకు దర్శకత్వం చేయాలి: షారూఖ్


ఓ మంచి సినిమాకు దర్శకత్వం చేయాలని బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ మనసులో మాట బయటపెట్టాడు. ఎన్నో సినిమాల్లో నటించిన షారూఖ్ కు సినిమా తీసేందుకు కావాల్సినంత అనుభవం, సామర్థ్యం ఉన్నాయి. అయినప్పటికీ ఆయన సినిమా తీయాలని ఎప్పుడూ కోరుకోలేదు. లండన్ లోని జీటీవీ 20వ వార్షికోత్సవ వేడుకకు హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సినిమాకు దర్శకత్వం చేయాలన్న కోరిక తీరాలని ఆకాంక్షించాడు. ఏదైనా కథను వివరంగా, పూర్తిగా చెప్పాలంటే అందుకు సరైన వేదిక టీవీ అని అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా షారూఖ్ బుల్లితెరపై ప్రశంసల వర్షం కురిపించాడు.

  • Loading...

More Telugu News