: ఓటమి కష్టంగా ఉంటుంది: సచిన్


టీమిండియా బాగా ఆడిందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. కష్టమైన జట్టుతో ఆడారని చెప్పిన సచిన్, ఓటమిని భరించడం కష్టంగా ఉంటుందని ట్వీట్ చేశాడు. కానీ టీమిండియా ఆటగాళ్లు శక్తి వంచన లేకుండా ఆడారని అన్నాడు. ఆస్ట్రేలియాకు అభినందనలు అని, అందరూ అభినందించాల్సిన విజయం సాధించారని పేర్కొన్నాడు. స్టీవ్ స్మిత్ సెంచరీతో రాణిస్తే, ఫించ్ చక్కని సహకారం అందించాడని, జాన్సన్ మంచి ముగింపుతో రెండు జట్ల మధ్య తేడా చూపించాడని సచిన్ ట్వీట్ చేశాడు. ఓడిపోయినప్పటికీ, పోరాట పటిమ చూపారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ టీమిండియాను ఓదార్చారు. వచ్చే ప్రపంచకప్ లో మీ కృషికి, అదృష్టం కలిసి రావాలని ఆకాంక్షించారు. ఫైనల్ లో చేరిన ఆస్ట్రేలియాకు అభినందనలు తెలిపారు.

  • Loading...

More Telugu News