: తప్పిదాలు సహజం...మానవ తప్పిదాలు సరిచేసుకోవచ్చు: స్పీకర్ కోడెల


చేసేపనుల్లో మానవ తప్పిదం జరిగితే జరిగి ఉండవచ్చని, మానవ తప్పిదాన్ని సరిచేసుకోవచ్చని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, చట్టసభల బాధ్యత అందరికీ తెలుసని అన్నారు. సభానిర్వహణ కత్తిమీద సాములాంటిదని ఆయన పేర్కొన్నారు. తన వృత్తి రాజకీయం కాదని, అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెప్పారు. స్పీకర్ అవుతానని తానెప్పుడూ భావించలేదని ఆయన చెప్పారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన స్థానంలో తాను ఉన్నానని, సభ్యుల సంఖ్యా బలాన్ని బట్టి సయమం నిర్దేశించాల్సిన బాధ్యత తనదని ఆయన స్పష్టం చేశారు. గతంలో శాసనసభలో అబద్ధం అనే మాట వాడేవారు కాదని ఆయన గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఎంత తీవ్రంగా మాట్లాడుతున్నారనే దానిని ప్రజలు పట్టించుకోరని, ఎంత పటిష్టంగా మాట్లాడుతున్నారు అనే దానిని ప్రజలు గమనిస్తారని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News