: 'గ్యాలరీలో అనుష్క ఉంటే...క్రీజులో కోహ్లీ ఎలా ఉంటాడు?'
టీమిండియా టాపార్డర్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ వైఫల్యంపై సోషల్ మీడియాలో అభిమానులు విరుచుకుపడతున్నారు. ఛేజింగ్ లో విశేషమైన అనుభవం ఉన్న కోహ్లీ నిర్లక్ష్యంగా షాట్ ఆడడంతో ఆసీస్ విజయావకాశాలు మెరుగయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో కోహ్లీపై సెటైర్లు మొదలయ్యాయి. కోహ్లీ క్రీజులో ఉంటే టీమిండియాదే విజయం, గ్యాలరీలో అనుష్క శర్మ ఉంటే కోహ్లీ క్రీజులో ఎలా ఉంటాడు? ఇంత చిన్న లాజిక్కును టీమిండియా అభిమానులు ఎలా మిస్సయ్యారబ్బా అంటూ ఎత్తిపొడుస్తున్నారు. క్వార్టర్స్ వరకు సింహంలా ఆడిన టీమిండియా సెమీస్ లో చిన్నపిల్లలా ఆడిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వరల్డ్ కప్ లో కోహ్లీ దారుణ వైఫల్యాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.